Breaking News

Tag Archives: tirupathi

ఎండియు ఆపరేటర్లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ఆయిల్ ఫెడ్ జిసిసి ఉత్పత్తుల అమ్మకం: జే సి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎండియు ఆపరేటర్లకు మరియు రేషన్ షాప్ డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా ఆయిల్ ఫెడ్ జిసిసి లు వారి ఉత్పత్తులను ఎండియుల ద్వారా సామాన్య ప్రజలకు బహిరంగ మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా సరసమైన ధరలలో అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జెసి చాంబర్లో ఆయిల్ ఫెడ్, జిసిసి, పౌరసరఫరాల అధికారులు, ఎండియు ఆపరేటర్లు, రేషన్ షాపు డీలర్లు తదితరులతో …

Read More »

ర్యాగింగ్ మానవ హక్కుల ఉల్లంగన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి రామ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి యాంటీ ర్యాగింగ్ చట్టంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని , చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కళాశాలలో చేరిన విద్యార్థులు స్నేహభావంతో మెలగాలన్నారు. అలాకాకుండా తోటి విద్యార్థులను ఇబ్బందులు …

Read More »

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈవో  సదా భార్గవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు  నిర్మల సీతారామన్ కు తీర్థప్రసాదాలు అందించారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, ఆలయ డిప్యూటి ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి…

-జాతీయ రహదారులపై టూ వీలర్ వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక అమలు జరిగేలా సంబంధిత శాఖలు చూడాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రమాదాలతో …

Read More »

ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు

-బ్యాంకర్లు నిరుద్యోగ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరులో సహకరించాలి: -తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూలం: ఎం పి గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఉపాధి కల్పనపై ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మిషన్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా గౌ తిరుపతి ఎం పి మద్దెల గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం పి మాట్లాడుతూ …

Read More »

ఈనెల 15 నుండి కుటుంబ డాక్టర్ విధానం అమలు: డిప్యూటీ సీఎం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం భద్రతకు మరింత భరోసాగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15 నుండి కుటుంబ డాక్టర్ విధానం అమలు చేస్తున్నారని అందుకోసం వైద్య అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరించి పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. శనివారం సాయంత్రం కుటుంబ డాక్టర్ విధానం జిల్లాలో అమలుపై డిప్యూటీ సీఎం, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా …

Read More »

జిల్లాలో మరో 25 రోజుల్లో జగనన్న పాల వెల్లువ అమలు : అహ్మద్ బాబు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని మారో 25 రోజుల్లో అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రత్యేక అధికారి మరియు కమిషనర్ రిజిస్టర్ కోపరేటివ్ సొసైటీ అహ్మద్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో జగనన్న పాలవెల్లువ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి, కమిషనర్ మరియు రిజిస్టర్ కోపరేటివ్ సొసైటీ , డైరీ డెవలప్మెంట్ …

Read More »

జిల్లాలో 112 సచివాలయాలలో ఆధార్ కేంద్రాలు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుతం సచివాలయాలలో ఉన్న 87 ఆధార్ కేంద్రాలతో పాటు మరో 25 ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తప్పులకు తావులేని ఆధార్ అందించాలే వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం మద్యాహ్నం జిల్లాకు చేరిన 25 ఆధార్ నమోదు ల్యాప్ టాప్ లతో పాటు 12 అనుసంధాన పరికరాలను జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందికి అందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు, పాస్ పోర్ట్ వంటి అనేక పథకాలకు ఆధార్ కార్డు …

Read More »

జీవనోపాధి కల్పించి మార్పు తీసుకుని రావాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి మద్యం అక్రమ తయారీ నిరోధం పై చర్యలు చేపట్టి నాటు సారా తయారీ వృత్తి గా పలు మార్లు కేసులలో ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కల్పించి వారిలో మార్పు తీసుకురావాలని ఆదేశించిన మేరకు జిల్లాలో ప్రస్తుతం గుర్తించిన 30 మందికి జీవనోపాధి మార్గాలకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు డి.ఆర్.డి.ఎ, ఎస్.ఈ.బి, ఎక్సైజ్, బ్యాంకర్స్ …

Read More »

బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలు పురోగతిలో వున్నాయి.. : జేసి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలతో పాటు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్ల స్థల సేకరణ వేగవంతం చేయాలని మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం అమరావతి నుండి కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు మరియు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సంయుక్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, జిల్లా సహకార అధికారులు, మార్కెటింగ్ శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి పలు …

Read More »