Breaking News

రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రపతి పతకాన్నిఅందుకున్న  వై.డి. రామారావును అభినందించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిస్వ భూషన్ హరిచందన్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్‌ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు  బిస్వ భూషన్ హరిచందన్ 2018-19 సంవత్సరానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రపతి బంగారు పతకాన్ని తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్  వై. డి. రామారావుకు శుక్రవారం రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అందచేసారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యమానికి దశాబ్దానికి పైగా చేసిన విశిష్ట సేవలు అందించినందుకుగాను  రామారావు కు జాతీయ స్థాయిలో ఈ ఘనత దక్కింది. భారతీయ రెడ్‌ క్రస్ ఉద్యమం కోసం అయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పతకం సాధించినందుకు  రామారావును గవర్నర్  హరిచందన్ అభినందించారు. రామారావుకు దక్కిన గౌరవం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ బృందం అందరికి గర్వ కారణం అని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ హెడ్ క్వార్టర్స్ ప్రతి సంవత్సరం రెండు బంగారు పతకాలను జాతీయ స్థాయిలో 15 ఏళ్ళకు పైగా విశిష్ట సేవలు అందించిన వారికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారు.  వై.డి. రామారావును 2018-19 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసారు. కోవిడ్ -19 పరిమితుల కారణంగా, రాష్ట్రపతి బంగారు పతకాన్ని వై.డి. రామారావు కు . ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి  ముఖేష్ కుమార్ మీనా, ఐఆర్‌సిఎస్ ఎపి రాష్ట్ర శాఖ చైర్మన్ ఎ. శ్రీధర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి  ఎ.కె. పరిడా పాల్గొన్నారు.

Check Also

గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *