Breaking News

`కాంక్రిట్‌ నిర్మాణాలు మాత్రమే కాదు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు నేటి లక్ష్యం : ప్రధాని


-గుజరాత్‌లోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
-రైల్వేని ఒక సేవా రంగంగానే కాకుండా ఒక ఆస్తిగా అభివృద్ధి చేశాం : ప్రధాని
-టైర్‌`2, టైర్‌`3 నగరాల్లోని ప్రతి రైల్వే స్టేషన్‌ కూడా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి : ప్రధాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ గుజరాత్‌లో రైల్వేకి చెందిన పలు కీలకమైన జాతీయ ప్రాజెక్టులను 16 జులై 2021 తేదీన వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వారు ఇదే కార్యక్రమంలో గుజరాత్‌ సైన్స్‌ సిటీలో అక్వాటిక్స్‌, రోబోటిక్స్‌ గ్యాలరీ మరియు నేచర్‌ పార్కును కూడా ప్రారంభించారు. ప్రధాన మంత్రి రెండు రైళ్లను, గాంధీనగర్‌ క్యాపిటల్‌`వారణాసి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గాంధీనగర్‌ మరియు వార్ధ మధ్య మెము సర్వీసు రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంక్రిట్‌ నిర్మాణాలే కాకుండా స్వంతంగా మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు లక్ష్యంగా సాగుతున్నట్టు తెలిపారు. పిల్లలలో అధ్యయనం మరియు సృజనాత్మకత అభివృద్ధి పరిచేందుకై ప్రాధాన్యత ఇస్తూ వారిలో వినోదం మరియు వికాసాభివృద్ధి కోసం సైన్స్‌ సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సైన్స్‌ సిటీలో ఆక్వారియం గ్యాలరీ వినోదం అందిస్తుందని, ఇది దేశంలోనే కాదు ఆసియాలో కూడా అతి పెద్దదని, రోబోటిక్స్‌ గ్యాలరీ యువతకు ఆకర్షణగా నిలిస్తూ వారి మనస్సులో ఉత్సుకత కలిగిస్తుందని ఆయన అన్నారు. 20వ శతాబ్ధం కార్యనిర్వణ పద్దతితో 21వ శతాబ్ధం అవసరాలను తీర్చుకోలేమని ఆయన అన్నారు. ఇందుకోసం రైల్వేలో నూతన సంస్కరణలు అవసరమన్నారు. నేటి కృషి ఫలితాలతో రైల్వే కేవలం సేవలకే పరిమితం కాకుండా రేపటి ఆస్తిగా పరిగణలో నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. టైర్‌`2, టైర్‌`3 రైల్వే నగరాల్లోని స్టేషన్లలో కూడా వైఫై సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బ్రాడ్‌గేజ్‌లోని కాపలా లేని అన్ని గేట్లను పూర్తిగా తొలగించినట్టు తెలిపారు. సువిశాల భారత దేశంలో రైల్వే కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. రైల్వే అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. గత కొద్ది సంవత్సరాల కృషి ఫలితంగా ఈశాన్య రాష్ట్రల రాజధానులకు రైళ్ల సేవలు అందుతున్నాయన్నారు. నేడు వాదనగర్‌ రైల్వే స్టేషన్‌ కూడా అభివృద్ధి అయ్యింది. ఈ స్టేషన్‌ నాలో ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. నూతనంగా ఆధునీకరించిన ఈ స్టేషన్‌ ఎంతో ఆకర్షనీయంగా ఉంది. నూతన బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ నిర్మాణంతో. వాదనగర్‌`మోధేరా`పటాన్‌ హేరిటేజ్‌ సర్క్యూట్‌ మెరుగైన రైల్‌ సర్వీసుతో అనుసంధానించబడింది. నవీన భారత నిర్మాణంలో ఒకేసారి రెండు ట్రాకులపై ప్రయాణించవలసి వస్తుంది. వాటిలో ఒకటి ఆధునీకరణ, మరొకటి పేదలు, రైతులు మరియు మధ్యతరగతి సంక్షేమంగా ఆయన అభివర్ణించారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *