-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరిన గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పని చేస్తున్న లెక్చరర్ లను కాంట్రాక్టు లెక్చరర్ లుగా పరిగణలోకి తీసుకుని వారితో కలిపేలా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి వారి సమస్యలు తెలియజేశారు. సమాన పనికిసమాన వేతనం అందించేలా ప్రభుత్వం చూడాలని కోరారు. కాంట్రాక్టు లెక్చరర్ లతో సామానంగా చూసేందుకు వారి విభాగంలో గెస్ట్ లెక్చరర్ లను కలిపేలా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ లకు ఇస్తున్నట్లు గెస్ట్ లెక్చరర్ లకు కూడా 37100 రూపాయలు అందేలా చూడాలని అన్నారు. అలాగే గెస్ట్ లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత కల్గించాలని కోరారు. ప్రతీ నెల పీరియడ్స్ కి సంబంధం లేకుండా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని. అంతే కాకుండా ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ఆరంభంలోనే రెన్యువల్ చేసేలా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా పలు సమస్యలను రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు దృష్టి కి తీసుకు వచ్చారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో న్యాయం జరగక పోతే మరెప్పుడు న్యాయం జరగదని అందుకే గెస్ట్ లెక్చరర్ ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెల్లాలని మంత్రిని కోరారు. అయితే రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పందిస్తూ గెస్ట్ లెక్చరర్ ల అసోషియేషన్ తమ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉంచుతానని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి వైకుకుంఠరావు, నరసింహమూర్తి లతో పాటు పలువురు సంఘం ప్రతి నిధులు పాల్గొన్నారు.