విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల లేఅవుట్లలో లెవెలింగ్, అప్రోచ్ రోడ్లు నిర్మాణం, స్టోన్ ప్లాంటింగ్ పనులను జూలై నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవిలత సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విజయవాడ డివిజన్ లో ఇళ్ల లేఅవుట్లు అభివృద్ధి, తదితర గృహనిర్మాణ అంశాలపై విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ తో కలిసి సంబంధిత అధికారులతో జెసి సమీక్షించారు.
ఈసందర్భంగా జెసి మాధవిలత మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారుల జియోటాగింగ్, ఇళ్ల గ్రౌండింగ్, జియోటాగింగ్, మ్యాపింగ్ ను ఇడబ్ల్యుయస్ లాగిన్ లో పొందుపరచాలన్నారు. గృహనిర్మాణాలు ప్రారంభ మైన దృష్ట్యా అన్ని లేఅవుట్లలో మెరకచే సే పనులు, అప్రోచ్ రోడ్లు, స్టోన్ ప్లాంటింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలన్నారు.
విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ డివిజన్ లో 396 లేఅవుట్ లలో 3836.53 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 2466.39 ఎకరాల్లో 378 లేఅవుట్లు ఉండగా, అర్బన్ ప్రాంతంలో 1370.14 ఎ కరాల్లో 18 లేఅవుట్లు ఉన్నాయన్నారు. ఇందులో 69 లేఅవుట్లు ప్రగతిలో ఉండగా, 36 లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణం, 12 లేఅవుట్ లలో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. 21 లేఅవుట్లకు సంబంధించి కోర్టు కేసులు, తదితర కారణాలవలన పనులు ప్రారంభం కాలేదన్నారు.
సమావేశంలో హౌసింగ్ జెసి శ్రీనివాస్ నుపూర్ అజయ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టరు యస్ యస్. శోభిక, హౌసింగ్ పిడి రామచంద్రన్, డ్వామా పిడి జి.వి.సూర్యనారాయణతో పాటు డివిజన్ లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …