Breaking News

ఇళ్లనిర్మాణాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుకు రావాలి…

-ప్రతి శుక్రవారం వైఎస్ఆర్ చేయూత యూనిట్ల గ్రౌండింగ్ డే …
-జగనన్న ఇళ్ళ ఎస్ హెఔ లబ్దిదారులో రుణాలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బ్యాంకర్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో ఎస్ ఏజ్ గ్రూపులోని సభ్యులైన ఇళ్ల లబ్దిదారులు గృహాలు నిర్మించుకునేందుకు బ్యాంకర్లు రుణాలు అందించడంలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు డిఆర్‌డిఏ ఎపియంలు తదితరులతో నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ రుణాలు, వైఎస్ఆర్ చేయుత, స్టాంప్ ఇండియా అంశాలపై కలెక్టర్ జె నివాస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ సంఘ తీర్మానం ఆధారంగా ఆయా ఎస్ హెజ్ గ్రూపులోని సభ్యుల్లో జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి కనీసం 50 వేల రూపాయల చొప్పున రుణ సౌకర్యం కల్పించి వారు వారి ఇళ్ల నిర్మాణానికి మరింత ప్రోత్సహాన్ని అందించాలన్నారు. జిల్లా తొలి విడతగా ఈనెల 22వ తేదిన 10 వేల మందికి బ్యాంకు రుణాలు అందించే దిశగా కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమై డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేసి బ్యాంకర్లకు అవసరమైన పత్రాలను సమర్పించడంలో సంబంధిత ఎపియంలు, కమ్యునిటి డెవలప్ మెంట్ ఆఫీసర్లు గట్టిగా పనిచేయాలన్నారు. బ్యాంకర్లు ఈ విషయంలో ఎంత మేర జిల్లా యంత్రాంగానికి సహకరిస్తే అందుకు మిన్నగా బ్యాంకర్లకు సహకారం అందిస్తామని జె. నివాస్ స్పష్టంచేశారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి రూ. 1.80 లక్షలు నిర్మాణ ప్రగతి ఆధారంగా బిల్లు చెల్లిస్తుంటుందన్నారు. అయితే ప్రాధమికంగా లబ్ధిదారుడు తమ ఇళ్లు నిర్మాణాలను ప్రారంభించుకునేందుకు బ్యాంకర్లు అందించే రూ. 50 వేల రుణం ఎంతో ప్రోత్సహంగా వుంటుందన్నారు. తద్వారా లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణలను వేగవంతంగా పూర్తి చేసుకునే అవకాశం వుంటుందన్నారు. గృహనిర్మాణలకు రుణాలు అందించడం పై పలువురు బ్యాంకర్లు తమ సన్నద్ధతను తెలిపారు. ఇండియాన్ బ్యాంకు వారు గృహలక్ష్మి పథకం కింద గ్రూపు తీర్మానం ఆధారంగా లక్ష వరకు రుణ సౌకర్యం అందిస్తామన్నారు. మరో 50 గ్రూపుల ద్వారా అందించేందుకు సిద్ధం అన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ చేయూత కింద లబ్దిదారులకు సంవత్సరానికి రూ. 18 వేల 750 చొప్పున 4 ఏళ్లలో రూ. 75 వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇందులో కొంతమంది లబ్ధిదారులను మ్యాపింగ్ చేసి పాడి పశువులు, గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ కింద 15 వేల యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టామన్నారు. ఇంతవరకు 9298 పాడి పశువులు యూనిట్లకు డాక్యుమెంటేషన్ పూర్తి చేయగా గొర్రెలు, మేకల యూనిట్ల సంబంధించి 2272 మంది లబ్ధిదారులు డాక్యుమెంటేషన్ పూర్తి చేశారన్నారు. ఇందుకు సంబంధించిన యూనిట్లు ప్రతి శుక్రవారం గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు. తప్పని సరిగా ఇన్సూరెన్స్ చేసింది లేనిది పరిశీలించాలన్నారు.
స్టాంఘ్రప్ ఇండియా కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రతి బ్యాంకు బ్రాంచి తప్పనిసరిగా ఒక ఎస్ సి లేదా ఎసీలకు, ఏ కులానికి చెందినా ఒక మహిళకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. స్టాంఘ్రప్ ఇండియా కింద ఏర్పాటు చేసే పరిశ్రమలకు 45 శాతం వరకు వివిధ రూపాల్లో సబిడ్సి, ఇతర రాయితీలు 5 సంవత్సరాల పాటు కల్పించినందున బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 689 యూనిట్ల స్థాపనకు రూ. 100 కోట్లు ఇవ్వడం జరిగిందని 2025 లోపు 1100 పరిశ్రమ యూనిట్లు నెలకునేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ప్రస్తుతం ధరఖాస్తు చేసిన 30 యూనిట్లను ఖరారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్ కుమార్ డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసరావు, ఎల్ డియం ఆర్ రామోహన్ రావు, మోప్మా పిడి ప్రకాశరావు, యుసిడి పిడి అరుణ, జిల్లా పరిశ్రమల కేంద్రం జియం సుధకర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *