Breaking News

100 వసంతాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రను కళాకారులు ప్రచారం చేయండి

-జంగాల అజయ్ కుమార్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
100 వసంతాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రను కవులు కళాకారులు తమ రచనలతో కళారూపాలతో ప్రజలకు వివరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు గురువారం విజయవాడ దాసరి భవన్లో రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ముఖ్యుల సమావేశం లో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 1925లో కమ్యూనిస్టు పార్టీ దేశంలో పురుడుపోసుకున్నదని ఏడాది కాలం పాటు 100 వసంతాల వేడుకలు నిర్వహించటానికి కమ్యూనిస్టు పార్టీ సన్నద్ధమవుతుందని ఇందులో కవులు కళాకారులు తమ రచనలతో కళారూపాలతో కమ్యూనిస్టు పార్టీ సాగించిన పోరాటం సాధించిన విజయాల గురించి సమాజంలో ఉన్న సమస్యల గురించి ప్రజలకు వివరించాలని వారు తెలిపారు ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చంద్రనాయక్ చిన్నం పెంచలయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో నంది నాటకోత్సవాలను సక్రమంగా నిర్వహించనందువల్ల కళాకారులు తీవ్ర నిరాశతో ఉన్నారని తక్షణమే సాంస్కృతిక శాఖకు సక్రమంగా నిధులు కేటాయించి ఆ శాఖ సక్రమంగా పని చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాలాకాలంగా భాషా సాంస్కృతిక శాఖ నిర్వీర్యంగా పడి ఉందన్నారు కళాకారులకు సరైన ప్రోత్సాహం ఇవ్వనందువల్ల అనేకమంది కళాకారులు నిరాశ నిస్పృహతో ఉన్నారని పేర్కొన్నారు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారుల సమస్యలపై కళాకారుల సంక్షేమం కోసం పోరాటానికి సన్నద్ధమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి గని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆ రామకృష్ణ ఆర్ పిచ్చయ్య మహంతి లక్ష్మణరావు వి నాగరాజు ఎస్ కే నజీర్, కె వి భాస్కర్ రావు , లంకా దుర్గా రావు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *