-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి సందర్భంగా నగరంలో బాణ సంచల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కలిగిన వ్యాపారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు మూడు రోజులు దీపావళి పండుగ సందర్భంగా లేబర్ కాలరీలో స్టేడియం కొరకు కేటాయించిన స్థలము నందు మరియు మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, సింగ్ నగర్ నందు గల స్థలముల లో బానసంచ విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు విక్రయదారులు దరఖాస్తు చేసుకోగలరని అన్నారు. బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు ఈనెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆఫీస్ పని చేయు దినములలో దరఖాస్తులు పొంది, దాఖలు చేసుకో గలరని అన్నారు. అక్టోబర్ 28, 2024న మధ్యాహ్నం 3 గంటలకు దరఖాస్తుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా స్టాల్స్ కేటాయించబడినని తెలిపారు.
Prajavartha Online Telugu News