-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద, ట్రాఫిక్ నియంత్రణకు మరియు ఇతర ట్రాఫిక్ సమస్యలను పోలీస్ అధికారులు కమిషనర్ కి వివరించగా, విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని, ట్రాఫిక్ నియంత్రణకు, ప్రజల శ్రేయస్సు కొరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎటువంటి అంశాలు ఉన్న దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ అన్నారు. ట్రాఫిక్ పోలీస్ వారు వివరించిన సమస్యను విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏ డి సి పి ప్రసన్నకుమార్, పోలీసు ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, బాల మురళీకృష్ణ, రమేష్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంటింగ్ ఇంజనీర్స్ పి సత్యనారాయణ, పి సత్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News