Breaking News

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్వాగతించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రైల్వే లైన్‌ ప్రకటన రాష్ట్రానికి శుభ పరిణామం. ఎపి రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుండి నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం రూ.2,245 కోట్ల అంచనాతో కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడం హర్షణీయం.
అమరావతి రాజధాని నిర్మాణానికి, ఆ ప్రాంత అభివృద్ధికి రైల్వే లైన్‌ ఎంతో ప్రయోజనకరం. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఈ రైల్వే లైన్‌ ఏర్పాటుకానుండడం వల్ల ఎపికి వాణిజ్య సంబంధాలు బలపడి, ఎపి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతి రైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *