Breaking News

రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రైతు చైతన్య యాత్రలు..

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల సమస్యల్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించి తద్వారా రైతుల్ని బలోపేతం చేయడమే రైతు భరోసా చైతన్య యాత్రల ముఖ్యోద్దేశమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం కలిదిండి మండలం పడమటి పాలెం లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పట్ల గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ఒక స్పష్టమైన వైఖరితో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా సన్న,చిన్నకారు, పేద రైతుల సంక్షేమం దిశగా రైతురాజ్యం నడుపుతున్న ఘనత మన ప్రభుత్వం ధ్యేయం అన్నారు.గతంలో రైతు బాంధవునిగా రైతు పక్షపాతి గా ఋణ మాఫీ, జలయజ్ఞం వంటి పథకాలద్వారా స్వర్గీయ డా.వై.ఎస్.ఆర్ ట్రెండ్ సెట్ చేస్, రైతు భరోసా, రైతుభరోసా కేంద్రాలు,పంటల బీమా వంటి అనేకానేక పథకాల ద్వారా ఆర్థిక రైతులకు ఆర్థిక సహాయాన్ని అందింస్తు అభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగనన్నదే అన్నారు. రైతులును నష్టాల ఊబిలోనుండి పైకి లాగి లాభాల బాట పట్టేలా ముఖ్యంగా తుఫానులు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన పంటను కోల్పోతే రైతులు కోలుకునే విధంగా పంటల బీమా ను ప్రభుత్వమే చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదన్నారు. ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే రైతుల కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు పంటల బీమా మొత్తం చెల్లించిందంటే రైతు శ్రేయస్సు పట్ల ప్రభుత్వ వైఖరి తెరిచిన పుస్తకంలా తేటతెల్లం అవుతుందన్నారు.అలాగే ఆక్వా రైతాంగానికి కరెంట్ యూనిట్ ఒకటికి రూ.4 ఉన్న స్థితి నుండి కేవలం యూనిట్ కి రూ.1.50 కే ఇవ్వడం ద్వారా జగనన్న తన పెద్ద మనసును చాటుకున్నారని అన్నారు.రైతు కోలుకోవాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్నింటినీ నేరుగా వారికి చేరవేయడం,వారికి భరోసా కల్పించి నమ్మకాన్ని పెంచడం ద్వారానే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యంగా మన ప్రాంతం ఆక్వారంగంలో అగ్ర పథంలో ఉందని అయితే చివారు ప్రాంతంలో ఉన్న మనకు సాగునీరు అందక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆక్వాసాగు చేసుకుంటున్నామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. అరకొర వసతులతోనే ఇంత విస్తృతంగా సాగు చేస్తుంటే ఇక ఆక్వాకు సంబంధించి పరిశ్రమలు గానీ, విద్యా కోర్సులు గాని,నాణ్యమైన సీడు ను అందించే హేచరీ లభ్యత గానీ ఈ ప్రాంతంలో ఉంటే మరింత మెరుగైన స్థితికి మన ప్రాంతం ఎదుగుతుందని అన్నారు. ఆ ఆలోచనతోనే మన కైకలూరు కి ఆక్వా హేచరీ, ఫిషరీస్ పాలిటెక్నిక్ కావాలని ప్రియతమ ముఖ్యమంత్రి వారిని కోరడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తద్వారా తిరుపతి వెంకటేశ్వర వెటరినరీ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ వారికి మన ప్రాంతంలో సదరు సంస్థల అవసరతను ధృవీకరించి నివేదించవలసినదిగా ప్రభుత్వం వారు ఆదేశించగా వారు సదరు అవసరతను సమర్థిస్తూ 50 ఎకరాలు భూమిని సేకరించి ఆ సంస్థలు స్థాపించమని ప్రభుత్వానికి నివేదించారన్నారు. త్వరలో జగనన్నతో ఆపని మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా గ్రామీణ రైతులకు మేలు చేసే విధంగా పాలు లీటర్ ఒక్కింటికి రూ.5 నుండి 7 రూ.వరకు అదనంగా వచ్చేలా ప్రభుత్వం అముల్ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకుని లాభాలను అందిస్తుందని అన్నారు. కైకలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు గంగాధర్ సమన్వయ కర్తగా నిర్వహించబడిన సభలో గ్రామ సర్పంచ్ సరస్వతి, కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు చిట్టూరి వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు అయినాల బ్రహ్మాజీ,ఎమ్మార్వో సుబ్రహ్మణ్య శర్మ, ఎంపీడీఓ పార్థసారథి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ప్రతిభ,పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా.గోవిందరాజు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు, నాయకులు, చెన్నంశెట్టి కోదండరామయ్య, టెక్కెం శ్యాం, బొర్రా ఏసుబాబు, ఊర శ్రీధర్,సానా వెంకట రామారావు, చిట్టూరి వాసు కోటేశ్వరరావు, వడుపు వెంకట రామారావు, తట్టిగోళ్ల నాంచారయ్య,కందుల వెంకటేశ్వరరావు, ముత్తిరెడ్డి సత్యనారాయణ, నున్న కృష్ణబాబు, నీలపాల సుబ్బయ్య, బత్తిన ఉమామహేశ్వరరావు, పులి భోగేశ్వరరావు, పాము రవికుమార్,, శివరాధాకృష్ణ,పేరం దుర్గారావు,, శీలం రాంబాబు, గొరిపర్తి వెంకటరెడ్డి, కాశీ,,వాసురాజు, గ్రామ ముఖ్య నాయకులువ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధక శాఖ అధికారులు, రైతులు, ఇతరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *