Breaking News

పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ -2024 కార్యక్రమాన్ని ప్రారంబించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2024 వేడుకలలను ఉత్సాహవంతమైన, ఆహ్లాదకర వాతావరణంలో ది.28.11.2024వ తేదీన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా విచ్చేసి లాంచనంగా ప్రారంభించారు.

ది. 28.11.2024వ తేదీ నుండి ది.30.11.2024వ తేదీ వరకు (మూడు రోజుల పాటు) జరిగే పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2024 నందు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఏడు జోన్లు (1) క్రైమ్ అండ్ సి. ఎస్.బి. జోన్ (2) ఈస్ట్ జోన్, (3) ట్రాఫిక్ జోన్, (4) వెస్ట్ జోన్, (5) సి.ఏ.ఆర్, & సి.ఎస్.డబ్ల్యూ జోన్ మరియు (6) రూరల్ జోన్ మరియు (7) సి.పి. ఒ. స్టాఫ్ గా ఏర్పడి పాల్గొనే ఈ క్రీడల్లో కబడ్డీ, వాలీబాల్, టగఫ్ వార్, హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, డిస్కస్ త్రో, షార్ట్ పుట్, షటిల్ బాట్మింటన్, రన్నింగ్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, 1500 మీటర్స్, 4×100 మీటర్స్ రిలే, 4×400 మీటర్స్ రిలే తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

ముందుగా ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది మరియు అధికారుల నుండి నగర పోలీస్ కమీషనర్ గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. అనంతరం క్రీడల్లో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది ప్రతిజ్ఞ చేసినారు. అధికారులు శుభసూచికగా పావురాలు మరియు బెలూన్లను గాల్లోకి వదిలారు. అనంతరం ప్రారంభ చిహ్నం క్రీడా జ్యోతిని పోలీస్ కమీషనర్ గారు వెలిగించగా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు  వి.శ్రీనివాసరావు, (ఆర్.ఐ. సి.ఎస్.డబ్ల్యూ), ఎం. తులసి చైతన్య (హెచ్.సి-2410), డి.నరేష్ బాబు (హెచ్.సి-2146) శ్రీనివాస్ నాయక్, (ఏ.ఆర్. హెచ్.సి-433), జి.సాబశివరావు, (ఏ.ఆర్. హెచ్.సి-306) కె. లక్ష్మి ప్రసన్న (పి.సి.3240) లు క్రీడా జ్యోతి చేతబూని పరుగు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్., ఉమామహేశ్వర రాజు ఐ.పి.ఎస్., ఎ.బీ.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి, ఎస్.వి.డి.ప్రసాద్, జి.ఆనంద్ బాబు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి రెట్టింపు ఉత్సాహంతో ఈ క్రీడల్లో పాల్గొని ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ…….. నిత్యం పని ఒత్తిడి తో పోలీసులు బిజీగా ఉంటారు, 2024 లో పోలీసు శాఖ చాలా పని ఒత్తిడి కి గురైన మాట వాస్తవం, ప్రజల్లో మన పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు పరిస్థితులు కు అనుగుణంగా పని తీరులో మార్పులు చేస్తున్నాం, ఇప్పుడు సాంకేతికత ఆధారంగా కేసులు ను చేధిస్తున్నాం, చాలా కేసులలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రధానంగా మారింది, శారీరక, మానసిక శ్రమ ఒత్తిడి పోలీసు పై ఉంటుంది, ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నా… క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, పోలీసు శాఖలో ఫిజికల్ ఫిటనెస్ ఎంతో అవసరం, వ్యాయామం, క్రీడలు… పోలీసుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతాయి, క్రీడలతో మనకి తెలియకుండానే మనసికంగా ధృడత్వాన్ని పొందుతాం, మా వంతుగా పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తాం, ప్రజల సంరక్షణ అనేది పోలీసులు కు ప్రధమ కర్తవ్యం, మాకు పోలీసులు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, మహిళా పోలీసులు కూడా ఎక్కువమంది క్రీడల్లో పాల్గొంటున్నారు, విధుల్లో కూడా చాలా చురుకుగా మహిళా పోలీసులు పని చేస్తున్నారు, మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో అందరూ బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నా, ఏడు టీం లు… ఏడు అంశాలలో పోటి పడుతున్నారు, ఈనెల 30 వ తేదీన ముగింపు సభ నిర్వహిస్తాం, సమాజానికి పోలీసు శాఖ దిక్సూచిగా మారాలి, యువతని మంచి మార్గంలో నడిపేలా పోలీసులు బాధ్యత తీసుకోవాలి, త్వరలో యూత్ స్పోర్ట్స్ ను కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నాం,నేటి యువత క్రీడలు పూర్తిగా మరచి పోతుంది, వారికి క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తాం,మహిళలు కూడా ఇంటికే పరిమితం కాకుండా ఎంచుకున్న రంగంలొ ఎదిగేలా ప్రోత్సహించాలి, క్రీడల ద్వారా మానసిక ఉత్సాహం తో విధుల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అని తెలియజేసారు. ఈ యాన్యూవల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ ను ఇంత ఘనంగా నిర్వహించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సి. ఎ. ఆర్. ఏ. సి. పి డి ప్రసాద రావు ని మరియు వారి సిబ్బందికి అభినందనలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్, ఉమామహేశ్వర రాజు ఐ.పి.ఎస్., ఎ.బీ.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి, ఎస్.వి.డి.ప్రసాద్, జి.ఆనంద్ బాబు, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *