Breaking News

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్శన్,సభ్యుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం

-ధరఖాస్తులు పంపేందుకు చివరి తేది డిశంబరు 11
-తే. 15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్ ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
-రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూల్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు చైర్ పర్శన్ మరియు ఒక సభ్యుడు(జుడీషియల్)మరో సభ్యుడు(నాన్ జుడీషియల్)నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 లోని సెక్షన్ 21లోని సబ్ సెక్షన్ 2 ప్రకారం కమిషన్ చైర్ పర్శన్ గా ధరఖాస్తు చేయగోరు వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పని చేసి ఉండాలని తెలిపారు. అలాగే మానవ హక్కుల కమిషన్ సభ్యులు(జుడీషియల్)గా ధరఖాస్తు చేసే వారు హైకోర్టు న్యాయమూర్తిగాను లేదా రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తిగా కనీసం 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. నాన్ జుడీషియల్ సభ్యుడు నియామకానికి మానవ హక్కులకు సంబంధించిన విషయాలలో పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుందన్నారు.

మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 24 ప్రకారం రాష్ట్ర కమిషన్ చైర్‌పర్సన్ మరియు సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు గాని లేదా డెబ్బై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అంత వరకూ ఆ పదవిలో కొనసాగేందుకు అర్హులు అన్నారు. పదవిని నిలిపివేసినప్పుడు, చైర్‌పర్సన్ లేదా సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం తదుపరి ఉద్యోగానికి అనర్హులన్నారు.

G.O. Ms.No.51, GA (HRC) డిపార్టుమెంట్, తే.30.01.2008 నాటి ఉత్తర్వుల ప్రకారం చైర్‌పర్సన్ మరియు సభ్యులకు జీత భత్యాలు చెల్లించబడతాయన్నారు. ఎప్పటికప్పుడు సవరించబడిన హైకోర్టు న్యాయమూర్తుల (సేవా నిబంధనలు) చట్టం, 1954 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం మరియు అలవెన్సులకు సమానమైన జీతం మరియు అలవెన్సులు ఛైర్‌పర్సన్ చెల్లించబడతాయన్నారు. ఇప్పటికే ఛైర్‌పర్సన్ పొందుతున్న సర్వీసు పెన్షన్‌తో పాటు ఈ జీతం కూడా పొందేందుకు అర్హులన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెల్లించాల్సినటు వంటి అలవెన్సులన్నింటిని పొందేందుకు చైర్‌పర్సన్‌కు అర్హత ఉంటుందన్నారు. అదే విధంగా సభ్యునికి ఎప్పటికప్పుడు సవరించిన విధంగా, హైకోర్టు న్యాయమూర్తుల (సేవా నిబంధనలు) చట్టం, 1954 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తికి చెల్లించవలసిన జీతం చెల్లించబడుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తికి చెల్లించే అన్ని అలవెన్సులకు సభ్యుడు అర్హులన్నారు.
తే. 15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్ ప్రకారం, పైన పేర్కొన్న పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్ క్రింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఆసక్తిగల వ్యక్తులు వారి పుట్టిన తేదీ, అర్హతలు, పరిజ్ఞానం మరియు మానవ హక్కుల విషయాలలో ఆచరణాత్మక అనుభవం మొదలైన వివరాలను తెల్ల కాగితంపై తెలియజేస్తూ వారి దరఖాస్తులను ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) (FAC), సాధారణ పరిపాలన (SC.II) విభాగం, 1వ బ్లాక్, A.P. సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి -522238 అనే చిరునామాకు 2024 డిశంబరు 11 వ తేదీలోపు అందేలా పంపించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *