కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైన్లను సక్రమంగా సాగేవిధంగా చూడగలిగితే వర్షాలు,వరదల సమయంలో ముంపు నివారణ సాధ్యమౌతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కలిదిండి మండలం కోరుకొల్లు లోని పెదలంక డ్రైన్ లో గుఱ్ఱపుడెక్క,కిక్కిస,తూడు తొలగింపు పనులకు ఆయన చేతులమీదుగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదలంక డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు మంజూరై కొనసాగుతున్నాయని, అయితే డ్రైన్ ఎగువ భాగంలో నీటి ప్రవాహం కిక్కస, గుఱ్ఱపుడెక్క,తూడు మూలంగా సక్రమంగా సాగక రైతుల పొలాలు ముంపు నకు గురియవుతున్న విషయం రైతాంగం తన దృష్టికి తేవడం జరిందన్నారు. ముందుగా ఎగువ భాగంలో ఈ సమస్యను పరిష్కరించాలని డ్రైనేజ్ శాఖ అధికారులను, అలాగే డ్రడ్జింగ్ కాంట్రాక్టర్ ను కోరడం తో వారు ఈరోజు ఫంటు పై ప్రొక్లైన్ సాయంతో పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక ఈ డ్రైన్ పై ఎటువంటి అవరోధం లేకుండా సజావుగా నీరు సాగిపోయేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఎమ్మెల్యే డిఎన్ఆర్ అన్నారు. తొలుత జల పూజను నిర్వహించిన అనంతరం పనులను ప్రారంభింప చేశారు. కార్యక్రమంలో డ్రైనేజి డీఈఈ శిరీష, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు, చెన్నంశెట్టి కోదండరామయ్య, బొర్రా ఏసుబాబు,ఉప సర్పంచ్ , చెన్నంశెట్టి నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షులు అంకెం నరసయ్య, కొచ్చెర్ల పీఏసీఎస్అధ్యక్షులు దాసరి చార్లెస్,అవకూరు సర్పంచ్, నరహరశెట్టి నరసయ్య, వడ్డీ గంగరాజు, చెన్నంశెట్టి సోమేశ్వరరావు, చెన్నంశెట్టి శ్రీనివాస్, చలమలశెట్టి లక్ష్మయ్య, బత్తిన ఉమామహేశ్వరరావు, చెన్నంశెట్టి మతారావు, చెన్నంశెట్టి ఫణి ప్రసాద్,మామిడిశెట్టి నాగముని, సిరింగి ముసలయ్య,చెన్నంశెట్టి కృష్ణ, గంగుల ఆంజనేయులు, గొర్తి కృష్ణకుమారి, తలారి వీరులు, వలవల గంగరాజు, దాసి ఏసుబాబు, సుండ్రు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Tags kalidindi
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …