Breaking News

పేద‌ల సామాజిక భ‌ద్ర‌తే ప్రభుత్వ లక్ష్యం

-ఎన్టీఆర్ భరోసా ద్వారా అర్హత కలిగిన ప్రతిఒక్కరికి పెన్షన్ల పంపిణీ.
-పెన్షనర్ కళ్ళల్లో ఆనంద క్షణాలను మరువలేం.
-జిల్లాలో 2,31,127 మందికి రూ. 97.93 కోట్లు పెన్షన్ల పంపిణీ.
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద‌లకు సామాజిక భద్రత కల్పించి ఆర్ధికంగా చేయూతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దనే పెన్షన్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.

*ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో వేకువజామునే వృద్ధాప్య పెన్షన్ దారుడు దొప్పలపూడి సాంబశివరావు, విభిన్నప్రతిభావంతుల పెన్షన్ దారులు గౌరినేని శ్రీలేఖ, మొక్కపాటి సత్యశ్రీ ల ఇంటి తలుపు తట్టి పెన్షన్ సొమ్మును అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు చెందిన వారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పధకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,31,127 మంది లబ్ధిదారులకు రూ.97.93 కోట్లు పెన్షన్లను ఒకరోజు ముందుగానే అందజేస్తున్నట్లు తెలిపారు. సాధారణ భద్రత పెన్షన్ల కార్యక్రమాన్ని పండుగ వాతావరంలో నిర్వహిస్తున్నామన్నారు. వేకువజామునే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పింఛన్లను నగదు రూపంలో వారికి అందజేస్తున్నప్పుడు లబ్ధిదారుని కళ్ళలో చూసిన ఆనందక్షణాలను ఎప్పటికి మరువలేనన్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు, ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ‌కు మ్యాప్ చేసిన ల‌బ్ధిదారుల ఇళ్లవ‌ద్ద‌కే వెళ్లి పెన్ష‌న్ మొత్తం అందించిన‌ట్లు తెలిపారు. పేద‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారిపై నిజ‌మైన ప్రేమ‌, చిత్త‌శుద్ధితో ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భరోసాను అందిస్తుందన్నారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరుచేస్తామని అదే విధంగా గ‌తంలో వివిధ కార‌ణాల వ‌ల్ల పెన్ష‌న్లు నిలిచిపోయిన వారి జాబితాను పునఃపరిశీలించి అర్హ‌త కలిగిన ప్రతిఒక్కరికి పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ కాకి దేవమాత, ఎంపీడీఓ సునీతశర్మ, తహశీల్ధార్ వై.వెంకటేశ్వరావు, మండల విస్తరణ అధికారి వి. మనోజ్, పంచాయితీ కార్యదర్శి వైఎస్ భాగ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *