-విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేసి లబ్ధిదారులకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాన్ని అందించడం జరుగుతోందని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య అన్నారు. శనివారం ఆయన విజయవాడ ఉత్తర మండలం పరిధిలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని.. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల క్షేమాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్‌టీఆర్ భరోసా పథక ప్రయోజనాలను అందిస్తోందని.. కొత్తగా అర్హులు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించి పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.