-డాక్టర్ సరస్వతి, ఏపీ శాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న పిల్లల్లో ఎయిడ్స్ పట్ల అవగాహనతోపాటు వారిలో మనో ధైర్యాన్ని కల్పించి వారికి అండగా నిలబడేందుకు కమ్యూనిటీ బ్రేక్ ఫాస్ట్ ను పున్నమి ఘాట్ లో శనివారం ఏర్పాటు చేసినట్లు ఏపీ శాక్స్ (ఏపీ శాక్స్ – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సౌసైటీ) అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సరస్వతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడతూ ముఖ్యంగా హెచ్ఐవి తో జీవిస్తున్న పిల్లల్లో మనోధైర్యాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి అందరూ కూడా బ్రేక్ ఫాస్ట్ చేయడం ద్వారా వాళ్లలో మనోధైర్యాన్ని పెంచాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా 60 మంది చిన్నపిల్లలు తో పాటు ప్రముఖులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు. ముఖ్యంగా వైఆర్జీ కేర్ సంస్థ మరియు ఏపీ శాక్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు.
బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు డా. టి. మంజుల, డా. కామేశ్వర్ ప్రసాద్, డా. భాగ్యలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ డా. చక్రవర్తి, అడిషనల్ డీఎం అండ్ హెచ్వో డా. జే. ఉషారాణి, కోఆర్డినేటర్ డా.రాజేంద్రప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, తంబు రాజ్, వైఆర్జీ కేర్ సంస్థ, ఏపీ శాక్స్ సిబ్బంది తదితరలు పాలోన్నారు..