కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికుల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని మాజీ సైన్నికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్ రావు కర్నూలు లో అన్నారు. కర్నూలు లోని టీజీవీ లలిత కళాసమితి లో మాజీ సైన్నికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురుపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు మాజీ సైనికుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.పురుషోత్తం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో ఈసీహెచ్ఎస్ కి సంబందించి ఇంప్యానేల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన కోరారు. కర్నూలు లో మాజీ సైన్నికులకు ప్రత్యేకంగా ఆసుపత్రులు లేనందున హైదరాబాద్, బెంగుళూరు లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వీరనారీమణులను ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు అండగా ఉండాలని శంకర్ రావు కోరారు. జిల్లా కు ఒక వార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలు లోని సైనిక పురం కాలనీలో మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కె.పురుషోత్తం, కురుపాటి నారాయణ, జమాల్ బాష, S ధనవిజయుడు, NRV సుబ్బారెడ్డి, G రామచంద్రుడు, బాలకృష్ణ, U సుధాకర్, J రాఘవేంద్ర, జమల్ భాష, మల్లిఖార్జున, జాకబ్ బాబు,,తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …