Breaking News

ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార విందు

-ఎయిడ్స్ కు గురి అయిన వారిపై వివక్షా వద్దు
-రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికీ సమాన అవకాశాలు
– జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
– డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు , రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు లు పేర్కొన్నారు. స్ధానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధికి గురి అయిన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్షా విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం కోసం జిల్లా యంత్రాంగం, న్యాయ సేవాధికార సంస్ధ, వైద్య ఆరోగ్య, స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్య యూనిట్స్ , విద్యా సంస్థలు, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధిని సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపు ఇచ్చారు. వ్యాధికి గురి అయిన వారిని దగ్గరకి చేర్చుకోవాలని తప్ప దూరం పెట్టకూడదు అన్న విషయాన్ని అవగాహన ఈ కార్యక్రమం ద్వారా తెలియ చేయడం ముఖ్య ఉద్దేశ్యం అని కలెక్టరు ప్రస్తావించారు. వ్యాధి బారిన పడిన వారిపై వివక్ష ధోరణిని విడనాడాలని, మనతో కలిసి ఉండేలా చూసుకోవాలి అని పేర్కొన్నారు. అదే సమయంలో ఎయిడ్స్ వ్యాధిని పడకుండా అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. సంక్రమణ చెందకుండా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ, ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి సహపంక్తి భోజనాలు కార్యక్రమానికి హాజరవ్వడం జరిగిందన్నారు. గౌరవ సుప్రీం కోర్టు వారు ఆదేశించిన ప్రకారం నల్సా చట్టానికి అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికీ సమాన హక్కు ఉందని పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధికి గురి అయిన వారి పట్ల వివక్ష చూపడం కానీ, వేరుగా చూడడం కానీ చేయరాదని స్పష్టం చేశారు. ఎయిడ్స్ గురి అయినారని కూడా ప్రస్తావించరాదన్నారు.  వారి యొక్క గుర్తింపుని కూడా బహిర్గతం చేయరాదని పేర్కొన్నారు.  వారు కూడా సమాజంలో సమాన హక్కులు కలిగిన వ్యక్తులుగా గుర్తించాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై సమాన అవకాశాలు ఉన్నాయని న్యాయ వ్యవస్థ పేర్కొన్న విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ శాఖల అధికారులు, వైద్యులు, స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్య ప్రతినిదులు , తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *