జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆదివారం నూతన పార్టీ ఆఫీసు ను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని అవినాష్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటి కప్పుడు ప్రజలోకి తీసుకువెళ్లాలని అవినాష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేసింది అని ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తుంది అని అవినాష్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసే ఈ మోసాన్ని ప్రజలకు వివరిస్తే వారి పైన అక్రమ కేసులు పెడుతున్నారు అని, అలాంటి అక్రమ కేసులకి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు బైపడారు అని, ప్రతి నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం రాక ముందు కరంట్ చార్జెస్ పెంచమని చెప్పి ఇప్పుడు సామాన్యుడు పైన పెద్ద బారం వేశారు అని అవినాష్ అన్నారు. గతంలో సచివాలయం వ్యవస్థ తో ఎలాంటి పని అయినా వెంటనే జరిగేది అని కానీ ఇప్పుడు మళ్లీ ఎక్కడికి వెళ్లలో తెలియట లేదు అని ప్రజలు బాధపడుతున్నారు అని అవినాష్ అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంత మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చూస్తున్నారు అని అవినాష్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం అని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్ మోహన్, తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి చిన్నా, సీనియర్ నాయకులు రవి గారు, మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags jaggaiahpeta
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …