Breaking News

నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం

–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. అన్న నందమూరి తారాక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరకు రాష్ట్రంలోని పేదలకు టీడీపీ ప్రభుత్వం నిస్వార్థంగా సేవలు అందిస్తోందని అన్నారు.

ఆదివారం ఉదయం నియోజకవర్గంలో 3వ డివిజన్‌లో జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సభ్యత్వ నమోదును పరిశీలించి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడమే నిజమైన రాజకీయం అని అన్న నందమూరి తారక రామారావు చెప్పేవారన్నారు. సమాజమే దేవాలయం–ప్రజలే దేవుళ్ళు అన్నది తెలుగుదేశం పార్టీ నినాదమని అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి నేటి వరకు పేద ప్రజల సంక్షేమం కోసం పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడమే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. ఒకవైపున రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో పయనించేలా చేస్తూనే ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సంక్షేమ పథకాలను పట్టాలెక్కించామని చెప్పారు. ఫించను సొమ్మును రూ.3 వేల నుంచి ఒక్క సారిగా వెయ్యి రూపాయ లు పెంచి రూ.4 వేలను అందచేస్తున్నామని, చెత్త పన్ను రద్దు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయడం, మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇవ్వడం వంటి సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ పథకాల గురించి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వివరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అసమర్థత పాలన వలన రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రజలపై పడిన భారాల గురించి ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలన్నారు. సభ్యత్వ నమోదు నిర్వహించి డివిజన్‌ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి వరకు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. పార్టీ డివిజన్‌ కమిటీ నాయకులతో పాటుగా అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోడానికి చాలా మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారిని కలిసి సంక్షేమ పథకాల గురించి వివరించి సభ్యత్వం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమం లో ‘ఉడా’ మాజీ ఛైర్మన్‌ తుమాటి ప్రేమ్‌నాథ్, పార్టీ నాయకులు తాడి బాబూరావు, గద్దె రామేష్, వడ్లపట్ల నాని, చంద్రకిషోర్, కొరపాటి సురేంద్ర, మిక్కిలినేని బుజ్జి, జైశేఖర్, దండమూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *