అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం ఆషాడ శోభతో ప్రకాశిస్తుంది. అషాడ ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు అనంతరం కొండ దిగువన పంచలోహ విగ్రహాల వద్ద ఆషాడమాస పూజల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమాలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కనులారా తిలకించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మరోపక్క ఎత్తయిన పచ్చని చెట్లు కింద భక్తులంతా కుటుంబ సమేతంగా వంటావార్పు చేసుకుని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ ఈవో విశ్వనాథరాజు తన సిబ్బందితో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
Tags AMARAVARTHI
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …