విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో వెస్ట్ జోన్ డి.సి.పి.గా కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకితభావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి, శాఖాపరమైన పరిపాలనా ప్రక్రియలో భాగంగా బదిలీపై విజయనగరం, ఏ.పి.ఎస్.పి. కమాండెంట్ గా వెళుతున్న విక్రాంత్ పాటిల్, ఐ.పి.ఎస్., ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యా లయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు, ఐ.పి.ఎస్., పోలీసు అధికారులు విక్రాంత్ పాటిల్ ని దుశ్శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా విజయవాడలో సమర్ధవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన వెస్ట్ జోన్ డి.సి.పి. విక్రాంత్ పాటిల్ ఐ.పి.ఎస్. ప్రజలకు అందించిన సేవలను గురించి కొనియాడి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ డి.సి.పి. వి.హర్షవర్ధన్ రాజు, అడ్మిన్ డి.సి.పి. డి. మేరీ ప్రశాంతి, సి.ఎస్. డబ్యూ. డి.సి.పి. ఎ.బి.టి.ఎస్. ఉదయ రాణి మరియు ఏ.డి.సి.పిలు, ఏ.సి.పి.లు, ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
