మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రగతిపై సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి శాఖల వారీగా సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిని ప్రభుత్వానికి వివరించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఎక్సైజ్, మైన్స్, అటవీ, మత్స్య, పశుసంవర్ధక, విద్య, వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, రహదారులు భవనాలు, గ్రామీణ నీటిపారుదల, జలవనరులు తదితర శాఖల ప్రగతిపై సమీక్షించారు. ఆయా శాఖలకు సంబంధించిన నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …