-జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతుల, ప్రజల భూసమస్య ల నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. గురువారం కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవిన్యూ సదస్సుకు ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా 272 రెవెన్యు గ్రామ పంచాయతీల పరిధిలో డిసెంబర్ 12 నుంచి జనవరి 8 వ తేదీ వరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. తొలిరోజు జిల్లాలో 23 గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి 386 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. రాజమండ్రీ డివిజన్ లో 149, కొవ్వూరు డివిజన్ లో 237 అర్జీలు స్వీకరించినట్లు తెలియ చేశారు. ప్రతి అర్జిని 33 రోజుల్లోగా పరిష్కారం లభిస్తుందని చిన్న రాముడు తెలియ చేశారు.
ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ, రెవిన్యూ సదస్సులో పరిష్కారం కోసం ఇచ్చే అర్జీ దారులు అధికారులకి తగిన పత్రాలు అందచేయ్యాల్సి ఉంటుందన్నారు. భూ సంబంధ సమస్యల పరిష్కార విధానంలో రెవిన్యూ సదస్సులు చక్కటి వేదిక అని పేర్కొన్నారు. ఈరోజు మండల పరిథిలో ఒక రెవిన్యూ సదస్సు నిర్వహించినట్లు అందులో 21 మంది అర్జీ అందచేశారన్నారు. జిల్లా, డివిజన్ పరిధిలో సమస్య పరిష్కారం కోసం చాలా మంది తమను కలసి ఆర్మీ ఇవ్వడం జరుగుతోందని, మండల కేంద్రంలో అర్జీలు ఇవ్వడం ద్వారా వాటి పరిష్కారం కోసం తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవిన్యూ సిబ్బంది , రైతులు, ప్రజలు పాల్గొన్నారు.