అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మిజోరం గవర్నర్ గా హరిబాబు ఇవాళ ప్రమాణం చేశారు. గత వారంలో ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించారు. సోమవారం నాడు ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఇటీవలనే గవర్నర్ల బదిలీలలు నియామకాలు చోటు చేసుకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. హరిబాబు సోమవారం నాడు ఐజ్వాల్‌లోని రాజ్ భవన్ లో హరిబాబు ప్రమాణం చేయించారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర పరిధిలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. హరిబాబు మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్ గా ఇవాళ భాద్యతలు చేపట్టారు.ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో సీఎం జోరామ్‌తంగా, టాన్‌లూయా, ఉప ముఖ్యమంత్రి స్పీకర్, లాలిన్లియానా పైలో, మంత్రుల మండలి ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు పలు పార్టీ ముఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానా గవర్నర్ గా బదిలీ అయ్యారు. ఇటీవలనే ఆయన హర్యానా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Tags amaravathi
Check Also
ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను పండుగ నిర్వహణకు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలి…
జిల్లాలో రానున్న జనవరి 2025 నెలలో మూడు రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహణకు …