-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు వాటర్ రిజర్వాయర్ లో నీరును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం తన పర్యటనలో భాగంగా 40వ డివిజన్, భవానిపురం లారీ స్టాండ్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 1500 కిలో లీటర్ల సామర్థ్యం గల వాటర్ రిజర్వాయర్ ను త్వరితగతిన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, శానిటరీ ఆఫీస్ లోని మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని, అవుట్ ఫాల్ డ్రైన్ సరిగ్గా లేకపోవడం గమనించి అతి త్వరగా కట్టించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 40 డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ శివ రాంప్రసాద్, ఇంజనీరింగ్ శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.