Breaking News

పల్లె పండుగ కార్యక్రమంలో నరేగా కింద మంజూరు కాబడిన పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ పనులు సీసీ రోడ్లు, క్యాటిల్ షెడ్లు తదితర పనులు రోజు వారీగా సమీక్షించుకుని పనులలో పురోగతి సాధించాలి

-పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసి రానున్న సంక్రాంతి నాటికి ప్రారంభించేలా పురోగతి సాధించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లె పండుగ కార్యక్రమంలో నరేగా కింద మంజూరు కాబడిన పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ పనులను రోజు వారీగా సమీక్షించుకుని పనులలో పురోగతి చూయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి రామ్మోహన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో ఎంపిడిఓ లు, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ పనుల పురోగతిపై గౌ. సిఎం, డిప్యూటీ సిఎం సమీక్ష చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో పెండింగ్ లో ఉన్న క్యాటిల్ షెడ్ లు, సీసీ రోడ్ల నిర్మాణాలను రోజువారీగా సమీక్షించుకుని పురోగతి సాధించాలని అధికారులకు సూచించారు. మెటీరియల్ కాంపోనెంట్, ఫైనాన్సియల్ కంపోనెంట్లు వివరాలు సమీక్షించుకుని,ఆన్లైన్ ఎక్స్పెండిచర్ నమోదు చేయడం, బిల్లులు అప్లోడ్ చేయాలని అన్నారు. ఏఈ పీఆర్, ఏపీఓ లు రోజువారీ ప్రణాళికతో ముదుకు వెళ్ళాలని, ఎంపిడిఓ లు పర్యవేక్షించాలని సూచించారు. సదరు పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేసి సంక్రాంతి నాటికి ప్రారంభించేలా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురోగతిలో వెనుకబడిన అధికారులు, సిబ్బందిపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిడి డ్వామా, ఎస్ఈ పీఆర్ అధికారులకు పలు అంశాలు వివరించారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *