విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రైతు దినోత్సవం 23 డిసెంబర్ న జరుపుకునే నిమిత్తం స్టెల్లా కళాశాల లో హోర్టీ ఎక్స్పో ఘనం గా ప్రారంభించారు
ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వదరస్ మాట్లాడుతూ రైతులు దేశానికి పట్టుకొమ్మలు అని రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు ఆవిష్కరణలు గురించి అవగాహన వుండాలని తెలిపారు. డాక్టర్ లక్ష్మణ స్వామి అగ్రికల్చర్ విభాగాధిపతి మాట్లాడుతూ ఈ ప్రదర్శన లో పూలు పండ్లు పెంపకం,మరియు దిగుబడి పద్ధతులు,ఆర్గానిక్ ఫార్మింగ్ శిఫ్టింగ్ కల్టివేషన్ పరియవరణహిత పంటలు పనిముట్లు వివిధ నమూనాలు ఈ ప్రదర్శన లో ఉంచారని తెలిపారు పలు కళాశాలలనుండి విద్యార్ధిని విద్యార్థులు వివిధ గ్రామాల నుండి రైతులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు వ్యాస రచన అగ్రికల్చర్ ఫ్యాషన్ షో తో పాటు వివిధ ఫుడ్ స్టెల్లా ను నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్.సిస్టర్. లీన క్వార్డ్రాస్, అధ్యాపకులు మనోజ్ , జాస్మిప్రియ, బ్లెస్సి, తేజశ్రీ, మాధురి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …