-బుధవారం రెవిన్యూ సదస్సులో 14 అర్జీలు ఇవ్వడం జరిగింది
హుకుంపేట (రాజమహేంద్రవరం రూరల్), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకి క్షేత్ర స్థాయిలో భూ సంబంధ సమస్యలు వారి ప్రత్యక్ష హజరు సమయంలో రికార్డులను పరిశీలించడం, వాస్తవ పరిస్థితిని వివరించడం కోసం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.
బుధవారం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామ రెవెన్యూ సదస్సు ప్రాంతానికి మధ్యాహ్నం 3.30 గంటలకి కలెక్టర్ ఆకస్మికంగా రావడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గ్రామ రెవెన్యూ సదస్సు లని ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించి, ప్రజలు భూ సంబంధ అంశాలపై ఎన్నో అర్జీలను స్వీకరించాలని పేర్కొన్నారు. ఈరోజు మొత్తం 14 అర్జీలు పరిష్కారం కోసం రావడం జరిగిందని తహసిల్దార్ వివరించారు. ప్రతి సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు జిల్లా కలెక్టరేట్ కు రావడం, అర్జీలు పరిష్కారం కోసం కోరడం జరుగుతున్నట్లు తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ సదస్సులను గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న రెవిన్యూ అధికారులు హాజరై వాటికీ పరిష్కార మార్గం చూపడం జరుగుతోందని అన్నారు. ఈ సదస్సుల్లో వస్తున్న ప్రతి అర్జినీ పిజిఆర్ఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేసి, అధికారులను జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు మొత్తం నాలుగు అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. భూ సంబంధ రికార్డులకు చెందిన జరిగిన కేటాయింపు ల సమస్య పరిష్కారం కోసం రావడం జరిగిందని, అయితే వాటికీ సహేతుకమైన పరిష్కారం కోసం గతంలో గ్రామ పంచాయతీ లో జరిగిన తీర్మానం రికార్డ్ కాపీ ఉంటే సమస్య పరిష్కారం సాధ్యం అవుతుందని తెలిపారు. రెవెన్యు సదస్సు సమయంలొ రికార్డుల పరిశీలనకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. రెవిన్యూ సదస్సు లో స్వీకరించిన ఆర్జీలకు జవాబుదారీతనం తో కూడిన పరిష్కారం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, పి జయ సూర్య కుమార్, రెవిన్యూ సిబ్బంది , సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.