-సభ్యత్వాలను మరింతగా పెంచాల్సిన బాధ్యత వహించాల్సి ఉంది
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చేసే సేవలు అనిర్విచనం అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, కొత్తగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు అయిన తరువాత సభ్యుల నమోదు, సంస్థలు నమోదు అవ్వడం లో కొంత వెనుకబాటు ఉందన్నారు. ఇందుకు ప్రథాన కారణం సభ్యత్వ విషయంలో అవగాహనా లేకపోవడం ఒక కారణం కావచ్చు అని పేర్కొన్నారు. జె ఆర్ సి , వై ఆర్ సి రెడ్ క్రాస్ సొసైటీ లలో శాశ్వత సభ్యత్వం కోసం చిన్న మొత్తంలో రుసుము చెల్లించి సభ్యులుగా డిగ్రీ, ఇంటర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలు సభ్యత్వం పొంది, జిల్లా యూనిట్ ను బలోపేతం చెయ్యాలని పేర్కొన్నారు. ఇందూ కోసం వివిధ సంస్ధ లకు మండల స్థాయి లో లక్ష్యాలను నిర్ధేసించా లన్నారు. రెడ్ క్రాస్ లో సభ్యత్వం గౌరవం తో కూడుకున్నదని, చిన్నప్పటి నుండీ అవగాహనా కల్పించి సభ్యత్వం మంచి పౌరులుగా తీర్చి దిద్దేందుకు ఒక వేదిక అన్నారు. రెడ్ క్రాస్ సభ్యులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా యూనిట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం కోసం ఆర్థికంగా సహయ సహకారాలు అందచేయాలని సభ్యులు కోరడం జరిగింది. సి ఎస్ ఆర్ కార్యకలాపాలు కింద నిధులను సమీకరించడం లో జిల్లా యంత్రాంగం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ, రెడ్ క్రాస్ జిల్లా యూనిట్ ప్రతిపాదిత అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, , వైస్ చైర్మన్ దాల్ సింగ్, ట్రెజరర్ సునీల్, సభ్యులు అనంత రావు, సమన్వయ కర్త మహాలక్ష్మి, ఇతర అధికారులు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.