రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని 132 EHT అండర్ గ్రౌండ్ పవార్ కేబుల్ లైన్ 6 పనులకు సంబంధించి ఏపీ ట్రాన్స్కో వారు షిఫ్టింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా సదరు అంశంపై ఉన్నతాధికారులకు నిధుల కొరకు ప్రతిపాదనలు పంపి ఉన్న నేపథ్యంలో సదరు అంశంపై, అలాగే 33 కెవి అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ మూడు మరియు 8 అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ లు షిఫ్టింగ్ అంశాలపై క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత విమానాశ్రయ, ఏపీ ట్రాన్స్ కో, ఏపీ స్పీడీసీఎల్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సదరు అంశంపై అధికారులకు పలు సూచనలు చేసి ఆచరణాత్మక ప్రణాళికలతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీడిసిఎల్ ఈఈ చంద్ర శేఖర్, ఏపీ ట్రాన్స్కో అధికారులు, రేణిగుంట తహశీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …