– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడలోని సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. పలు అంశాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి చంద్రశేఖర్ తీసుకువచ్చారు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా ప్రజోపయోగకరమైన సేవలు అందుతున్నాయని, శ్రీ కిరణ్ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన నేత్ర వైద్యం అందిస్తున్నారని, ఈ సంస్థలకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేత డా. జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.