అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, విజయవాడ వారు శుక్రవారం విజయవాడ డివిజన్ లోని మండలములైన నందిగామ, పెనుగంచిప్రోలు మండలములను సందర్శించి, తహశీల్దార్ కార్యాలయములలో ఫీవర్ సర్వే, సర్వేలియన్స్ టీం లతో సమావేశమును ఏర్పాటు చేసి, వారికి తగు సూచనలు ఇచ్చియున్నారు, వాలెంటీర్స్, సచివాలయ సిబ్బందికి విదిగా ప్రతి ఇంటిని సందర్శించి కోవిడ్ 19 మరియు అనారోగ్యము యొక్క లక్షణములు కలవారిని గుర్తించవలసినదిగా ఆదేశించియున్నారు. మరియు పోలీస్ శాఖ వారికి మాస్క్ లేకుండా ఎవరైనా సంచరించినట్లైతే వారికి అపరాద రుసుమును విదించవలెనని ఆదేశించియున్నారు. మరియు రెవెన్యూ సిబ్బంది, పంచాయితీ రాజ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కలసి ఈ కోవిడ్ ను రేటును తగ్గించవలసినదిగా సూచనలు జారీ చేయున్నారు. ఈ కార్యక్రమములో తహశీల్దార్, MPDO, మెడికల్ ఆఫీసర్, AE హౌసింగ్, AE పంచాయతీ రాజ్ మొదలైన అధికారులందరూ పాల్గొనియున్నారు.
Tags vijayawada
Check Also
ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను పండుగ నిర్వహణకు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలి…
జిల్లాలో రానున్న జనవరి 2025 నెలలో మూడు రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహణకు …