విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శాకాంబరి మాత ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. మూలవిరాట్టు విగ్రహంతోపాటు ఆలయ ప్రాంగణాన్ని దేవస్థానం సిబ్బంది వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమాలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనంతో పాటుగా.. తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ శాకంబరీ దేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఇదేవిధంగా ఉండాలని ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో విరాజిల్లాలని.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలిగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, దోనేపూడి శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, కె.వెంకటరమణ, మైలవరపు రాము, వెంకటేశ్వరరెడ్డి, చాంద్ శర్మ, జె.కె.సుబ్బారావు, మారుతి, సనత్ తదితరులు పాల్గొన్నారు.
గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు…
ముత్యాలంపాడులోని గంగానమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి దేవి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. అమ్మవారిని వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అందంగా అలంకరించారు. ఈ పూజ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఎన్ని సార్లు దర్శించుకున్న తనివి తీరని దివ్యమంగళ స్వరూపం అమ్మవారిదని పేర్కొన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, శర్వాణి మూర్తి, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరాజు, మానం వెంకటేశ్వరరావు, సామంతపూడి రాఘవరాజు మరియు వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.