విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విపత్తు సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా విధినిర్వహణ చేసిన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే మరియు 1’2’3, స్వచ్ఛ పాలిటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణ ఫ్యాన్సీ అసోసియేషన్ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టులకు ఆనందయ్య కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి చేయూత లభించేందుకు, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపకులు బడే జానీ, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా మందు పంపిణీ చేయటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి ఎందరో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ రాజు చలపతిరావు మాట్లాడుతూ కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను, కరోనా మందు పంపిణీ చేస్తున్న యూనియన్ నాయకులను, స్వచ్ఛ పాలిటిక్స్ సంస్థ నిర్వాహకులను అభినందించారు. కృష్ణపట్నం ఆనందయ్య సహకారంతో 123 స్వచ్ఛ పాలిటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే సుమారు 50 వేల మందికి ఆనందయ్య కరోనా మందు ఉచితంగా పంపిణీ చేశామని సంస్థ నిర్వాహకులు షేక్ బడేజాని తెలిపారు. ఈ సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షులు జుజూరు శేష ప్రభాకర్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకె.మోహన్ రావు, పి.భక్తవత్సలం, కెవి.భాస్కర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ తరుపున ఎంఎల్ సి.లేళ్ళ అప్పిరెడ్డి ని, స్వచ్ఛ పాలిటిక్స్ సంస్ట వ్యవస్థాపకులు బడే జానీ ని,ఐ జె యు ఉపా ధ్యక్షులు అంబటి ఆంజనేయులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావులను యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …