అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు – పేదలందరీకి ఇళ్లుసమీక్ష సమావేశం లో గురువారం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మైలవరం నియోజకవర్గం లో నవరత్నాలు – పేదలందరీకి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం లో భాగంగా శాసనసభ్యునిగా తన వంతుగా చేపట్టిన కార్యక్రమాలు, పేదలకు అందిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించారు. మైలవరం తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న నేపద్యంలో ప్రతేకశ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన జరిగేందుకు శాసనసభ్యునిగా కాకుండా ఒక బిల్డర్ గా తనకు ఉన్న అనుభవాన్ని వివరిస్తూ జిల్లా అధికార యంత్రాంగాన్ని అదిశగా అప్రమత్తం చేయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశ మందిరం లో ప్రభుత్వ చిప్ విప్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాధరాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, ప్రిన్నిపల్ కార్యదర్శి అజయ్ జైన్, యండి నారాయణ గుప్తా, ప్రభుత్వ విప్ లు, సహచర శాసనసభ్యులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …