Breaking News

స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కు ప్రాధాన్యత ఇవ్వండి : జేసి బీఆర్ అంబేద్కర్

-కొవ్వూరు డివిజిన్ తహసీల్దార్ లు , రెవెన్యూ అధికారులతో జేసి సమావేశం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ శాఖ పరంగా వసూలు చెయ్యవలసిన మీ మీ మండల పరిధిలో నీటి తీరువా పన్నులు, ఆర్ ఆర్ యాక్ట్ రికవరీలను వసూళ్ళ చెయ్యాలని, కోర్ట్ కేసుల , పిఓఎల్ఆర్ పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు సత్వరం పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు.

బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు డివిజిన్ తహసీల్దార్ లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి అంబేద్కర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో స్పందన ఫిర్యాదుల పరిష్కారం మొక్కుబడిగా కాకుండా , బాధితుల ఫిర్యాదులను నాణ్యత ప్రమాణాలతో పరిష్కారం చూపాలన్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను పరిష్కారం చూపడంతో బాధితుల పక్షాన్న న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు.మండలాలు వారిగా స్పందన ఫిర్యాదు లు, పరిష్కరించినవి, పెండింగ్ వాటిపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఆ దిశలో నే పరిష్కారించిన, పెండింగ్ లో ఉన్న స్పందన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు జేసి తెలిపారు.

కొవ్వూరు డివిజిన్ పరిధిలో రూ.8.86 నీటి తీరువా పన్నులను వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం రూ.68 లక్షలు మాత్రమే వసూలు చేశారన్నారు. ఇంకా రూ.8.18 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వసూళ్ళ చెయ్యాలని స్పష్టం చేశారు. కొవ్వూరు డివిజిన్ పరిధిలో పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించి సమీక్షిస్తూ, 151 కోర్ట్ కేసుల కు గాను 138 కేసులకు కౌంటర్ దాఖలు చేసారు. స్టే వేకెట్ కు సంబంధించిన 17 కేసులకు, 17 ఫైల్ సమర్పించడం జరిగిందని, అయితే అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ పై అంశాలపై సోమవారం నాటికి నివేదికను అందచెయ్యలన్నారు. రెవిన్యూ ఎల్ఏ కేసుల 22 పెండింగులో ఉన్నాయని, అలాగే ఎల్ఏ (నవరత్నాలు) కేసులు 108 పెండింగులో ఉన్నాయని జేసి అంబేద్కర్ పేర్కొన్నారు. వీటిపై సోమవారం కలెక్టర్ నిర్వహించే విసి సమయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డివిజిన్ పరిధిలో ఆర్బికే లు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాల భవన నిర్మాణాల భూముల నిర్మాణాల స్థితి నివేదిక పై జేసి సమీక్షించారు. అనంతరం బ్ రెవిన్యూ రికవరీ చట్ట (ఆర్ ఆర్ యాక్ట్) పరిధిలో 52 కేసులలో వసూలు చెయ్యవలసి ఉన్న రూ.8.41 కోట్ల రికవరీ చేసే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మండలం వారిగా ఆర్ ఆర్ రికవరీ లపై సమీక్షిస్తూ, పెరవలి మండల పరిధిలో సుమారు రూ.6 కోట్లకు పైగా వసూలు ఉన్నట్లు తెలిపారు. అన్ని మండల తహసీల్దార్ లు నెల రోజుల్లో నోటీసులు జారీ చేసి వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 3 మండలాలు పరిధిలో (తాళ్లపూడి, దేవరపల్లి, గోపాలపురం) పైలట్ ప్రాజెక్ట్ గా పిఓఎల్ఆర్ మొదటి దశ 51 గ్రామాల్లో నిర్వహిస్తున్న మని , సోమవారం నాటికి డి ఐ ఓ సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం వివిధ రెవిన్యూ సంబంధించిన నివేదిక లపై, 2014 తర్వాత పెండింగ్ లో రైతు ఆత్మహత్య ల కేసులు పరిష్కార స్థాయి నివేదిక పై సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి డి. లక్ష్మారెడ్డి, ఏ ఓ జవహర్ బాబాజీ,12 మండలాల తహసీల్దార్ లు, సర్వే అధికారి , ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *