Breaking News

పిడిఎస్ రైస్ ఆక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి-తాసిల్దారు 

-పోలీసు, రెవిన్యూ, సివిల్ సప్లయి సిబ్బందితో ఉమ్మడిగా దాడులు నిర్వహిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు మండల తాసిల్దారు డి. సునీల్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో రేషన్ షాపు డీలర్లు, ఎండియు డ్రైవర్లు, సివిల్ సప్లయిస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ బియ్యం ఆక్రమ రవాణాపై పోలీసు అధికారులతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో నిరు పేదలకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని అందజేస్తున్నదని అయితే బియ్యం అవసరం లేని కొంత మంది వాటిని విక్రయిస్తు ఆక్రమాలకు తెరతీస్తున్నారని బియ్యం విక్రయించిన వారు కొన్నవారు చట్ట ప్రకారం శిక్షార్హులే అన్నారు. ఈ ఆక్రమాలలో కొంత మంది రేషన్ డీలర్లు, ఎండియు డ్రైవర్లకు కూడా భాగస్వామ్యం ఉంటున్నదన్నారు. కొంత మంది మద్య దళారులు గ్రామాలలో ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేసి వాటిని మోటారు సైకిళ్లపై తిరిగి విక్రయిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిడియస్ రైస్ ఆక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఉదాహరణగా తాసిల్దారు పేర్కొ ంటూ మధ్యదళారీలను హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో పేదల కోసం నాణ్యమైన బియ్యం కొని ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి అందజేస్తున్నాదని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత లబ్దిదారులపై ఉందన్నారు. ఎండియు డ్రైవర్లు లబ్దిదారుల ప్రతి ఇంటికి వెళ్లి బియ్యం అందజేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. పిడిఎస్ రైస్ అమ్మకం, కొనుగోలు అరికట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు రెవిన్యూ, పోలీసు, సివిల్ సప్లయిస్ సిబ్బంది ఉమ్మడిగా దాడులు నిర్వహించాలన్నారు. ఈ
చిలకలపూడి సిఐ అంకబాబు, ఇనగుదురు సిఐ రమేష్, ఆర్ ఐలు, పిడిఎస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది ఎండియు డ్రైవర్లు, రేషన్ డీలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *