విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని,వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి సామాజికంగా ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని, ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 15 వ డివిజన్, రామలింగేశ్వరనగర్ పుట్ట రోడ్డు లో గల దేవాదాయ స్థలంలో గత 40 సంవత్సరాల నుండి నివసిస్తున్న 50 నిరుపేద కుటుంబాల వారి నివాస గృహాలను తొలగిస్తున్నారు అని ప్రతిపక్ష నాయకులు అపోహలు సృష్టిస్తున్న విషయం స్థానిక సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు అవినాష్ దృష్టికి తీసుకురాగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలబడి అధికారులతో మాట్లాడటం జరిగింది. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారి రాజకీయ మనుగడ కోసమే అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని విమర్శించారు. మీ చిల్లర రాజకీయాలు, నీచ రాజకీయలు నమ్మే పరిస్థితిలో ప్రజానీకం లేరు అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎవరు అధైర్య పడవద్దు అని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి తగిన పరిష్కరానికి కృషి చేస్తాననిఅవినాష్ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఎలాగైతే నాడు నాన్న స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇలాగే అధికారులు వచ్చి ఇళ్లు తొలగించాలని చూడగా ఆయన హుటాహుటిన లుంగీ బనియన్ మీద వెళ్లి ఆపించడం జరిగింది అని తెలిపారు. వీరందరికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా శాశ్వత పరిష్కారం చూపెడ్తామని చెప్పారు.ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తో మాట్లాడగా అక్కడ ఎలాంటి తొలగింపులు చేయడం లేదన్నారు అని తెలిపారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కి చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి రాద్ధాంతలు స్పృటించి రాజకీయం చేయాలని చూస్తున్నాయి అని, మీ రాజకీయ మనుగడ కోసం ఇలా పేదలను అడ్డుపెట్టుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దేవినేని నెహ్రూ ఎప్పుడు కూడా ఏ సమయంలో అయిన సరే పేదల పక్షాన పోరాటం చేసారని నేడు ఆయన తనయుడు గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా జగన్ తో మాట్లాడి నియోజకవర్గంలో ఇలా పట్టాలు లేకుండా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న అందరికి పట్టాలు ఇప్పించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …