విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగమునకు మరియు రెండవది అదనపు కమీషనర్ (జనరల్ ) కి అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఎటువంటి అర్జీలు వచ్చిఉండలేదు. పై సమస్యల అర్జిలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబందిత అధికారులకు సూచించారు.
Tags vijayawada
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …