మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాలు పరిశుభ్రంగా వున్నపుడే ప్రజల ఆరోగ్యాలు బాగుంటారని, ఆ దిశగా అందరూ కృషి చేసి జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని నెరవేర్చాలని శాసనసభ్యులు,దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎంపీడీఓ శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో పరిపాలన నేరుగా అందించే దిశగా, అనేక మార్పులు తెస్తూ వాలంటరీ, సచివాలయం వ్యవస్థ స్థాపించారన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసి, పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేశానన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో శానిటేషన్, రోడ్డుల పైన చెత్త వేయకూడదని, ప్రతి పంచాయతీకి ప్రత్యేక నిధులు కేటాయించి, చెత్త సేకరణ నూతన రిక్షాలను, నూతన ఆటోలను గ్రామ పంచాయతీలకు అందజేశారు. అదేవిదంగా బహిరంగ మల విసర్జన నిషేధం, రోడ్డుల పైన ఉమ్మి వేయడం లాంటివి నిషేధం చేశారని, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. గత సంవత్సరం కాలం పైబడి మన అందరిని కోవిడ్ ఇబ్బందులు పెడుతుందని, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పానికి తోడుగా ఇటీవలనే జగనన్న పచ్చతోరణం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని, ప్రతిగ్రామంలో మొక్కలు నాటి పెంచడం,ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం చేయగలిగితే ప్రజారోగ్యం బాగుపడటం తో పాటుగా మంచి గాలితో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు.ఈ రకంగా పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రత తో ఉండే విధంగా సంకల్పం చేసుకుని ఆచరణకు ప్రతిఒక్కరు నడుం కట్టాలని ఎమ్మెల్యే కోరారు. సభలో తొలుత స్వచ్ఛ సంకల్ప ప్రమాణం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మెండ ఝాన్సీ యంఈవో నరేష్,ఏపీఎం సత్యనారాయణ,సీడీపీవో ధనలక్ష్మి, మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్,,, వైస్ సర్పంచ్ జొన్నలగడ్డ నాగలక్ష్మి,, నాయకులు,, ముంగర మల్లికార్జునరావు, గుడివాడ చిట్టిబాబు, పెద్దిరెడ్డి శ్రీనివాస్, యార్లగడ్డ సత్యనారాయణ,బేతపూడి రాజు, బూర్ల భోగేశ్వరరావు, బోనం శేషగిరిరావు, గుడివాడ బాలాజీ, నేతల నాగరాజు, చిన్ని శ్రీకృష్ణయాదవ్, నాగదసి చంటి, బొమ్మనబోయిన గోకర్ణ, సైదు చంద్రయ్య, బొమ్మనబోయిన వరప్రసాద్, కాగిత సూర్యనారాయణ, ఫోనుగుమాటి సామ్రాజ్య వాణి, ముత్యాల రాజా సులోచన, ఘంటసాల రత్నమణి, మొగనాటి తులసిరత్నం, గూడపాటి ఝాన్సీ, మెండ సురేష్,, ముత్యాల రామచంద్రరావు, బొమ్మిశెట్టి వాణి, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది,ఏఎన్ఎంలు వాలంటరీలు, తదితరులు పాల్గొన్నారు
Tags mandavalli
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …