Breaking News

ఓర్పుతో విన్నారు… స్పందించారు… మానవతతో వెంటనే పరిష్కారించారు…

-ఆర్జీదారుల సమస్యను పరిష్కరించిన సబ్ కలెక్టర్
-ఐదు నెలలుగా అగిపోయిన రేషనను వెంటనే ఇప్పించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదు నెలలుగా రేషన్ అగిపోయింది స్పందించే నాధుడులేడు స్పందనలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు కలసి బాదను వెల్లబుచ్చుకున్నా వృద్ధురాలు తంగిరాల లీలావతి ఆమె బాదను ఓర్పుతో విని స్పందించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే రేషన్ ఇప్పించడంతో ఆమె కంటిలో ఆనంద భాష్పాలు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్‌కు చెందిన వృద్ధురాలు తంగిరాల లీలావతి వినతి పత్రం అందిస్తూ తనకు 5 నెలల నుంచి రేషన్ ఇవ్వడం లేదని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె బాదను ఓర్పుతో వింటు దీనికి కారణం ఏమిటని లీలావతిని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా వేలిముద్రలు పడటంలేదని చెబుతున్నారని అనడంతో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి ఆ వృద్ధురాలుకు అందవలసిన రేషనను వెంటనే పంపిణీ చేయవల్సిందిగా ఆదేశించారు. వెనువెంటనే సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించి వృద్దురాలైన తంగిరాల లీలావతికి రేషన్‌ను అందజేశారు.
మరో వృద్ధురాలు తన ఆస్తి కాజేసి పిల్లలు తనను చూడటం లేదని ఫిర్యాదు చేయగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ స్పందిస్తూ ఇందుకు సంబంధించి ఫిర్యాదును సీనియర్ సిటీజన్ కోర్టులో కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఆ వృద్ధురాలు తన ఆరోగ్య రిచ కోర్టుకు హాజరు కావడం కష్టతరమని చెప్పడంతో వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యాలా చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు విభిన్న ప్రతిభావంతులు స్పందన ఆర్జీలు కార్యాలయం లోపలికి వచ్చి ఇవ్వలేని పరిస్థితిని గుర్తించిన సబ్ కలెక్టర్ ప్రవీన్ చంద్ స్వయంగా వారి వద్దకే వెళ్లి వారి సమస్యలను ఎంతో ఓపికగా తెలుసుకుని మానవీయకోణంతో వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఒక వృద్ధుడు తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరాగా సంబంధిత గ్రామ సచివాలయ సిబ్బందితో సబ్ కలెక్టర్ మాట్లాడి ఆ వృద్ధుడుకు పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకున్నారు.  విజయవాడ సుబ్బారావు వీధికి చెందిన బారపాటి మలేశ్వరి తాను వితంతువు పెన్షన్ తీసుకుంటున్నాని, తన కుమారుడు మరణించడంతో కోడలు భవాని కూడా వితంతువు పెన్షన్ పొందుతున్నారన్నారు. అయితే తాను నూజివీడుకు నివాసం వెళ్లడం జరిగిందని అక్కడ తనకు వితంతువు పెన్షన్ తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో తీసుకున్న ఆర్జీలపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని వారి బాదను అర్ధం చేసుకుని పరిష్కారించినప్పుడు వారి కంటిలో ఆనందం చెప్పనలవికాదన్నారు. మానవతాకోణంలో స్పందించి సమస్యలను పరిష్కారించి మన్ననులను పొందడమే ఒక గుర్తింపుగా భావించాలనే ఆయన అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయితీ అధికారి కెకె చంద్రశేఖర్, డిప్యూటి డిఇఓ ఎల్. చంద్రకళ, సిడిపివోలు జి. మంగమ్మ, సువర్ణ, ఆర్టీసీ డియం సి. బాలజీ, డిప్యూటీ తహాశీల్దార్ సిహెచ్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *