Breaking News

నేడు మనం మొక్క ను నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో మహా వృక్షమై మంచి ఫలాలతో పాటు ప్రాణవాయువును అందిస్తుంది… : ఎమ్మెల్యే డిఎన్ ఆర్

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ఒక మొక్క ను నాటి సంరక్షిస్తే అది భవిష్యత్ లో మహా వృక్షమై చెప్పలేని గొప్ప ఫలాల్ని అందిస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ముదినేపల్లి మండలం సింగరాయపాలెం లోని శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహమణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ ఆర్ మాట్లాడుతూ పచ్చని పల్లెసీమల్ని చల్లని వాతావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ఒక ఖచ్చితమైన ఆచరణ ప్రణాళిక తో ముందుకు సాగుతుందని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రం లోని అన్ని గ్రామాల్లో వీలున్న రహదారుల వెంబడి,నాడు నేడు స్కూల్స్ ప్రాంగణాలలోనూ అలాగే వీలున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలప్రాంగణాల్లో సుమారు 2 సంవత్సరాలవయస్సు కల్గిన మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని 10 మాసాల పాటు పెంచి పోషించి సంరక్షించడానికి గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వ్యక్తుల్ని నియమించడం జరుగుతుందన్నారు.ఇది ఇంతకు ముందెన్నడూ లేని వ్యవస్థ అన్నారు.ఏదైనా పనిని తూతూమంత్రంగా కాకుండా ఒక నిబద్ధతతో పూర్తిచేయడం అనేది జగనన్న విధానం అన్నారు. గ్రామాల్లో సర్పంచులు,పంచాయతీ కార్యదర్సులు,ఫీల్డ్ అసిస్టెంట్లు దీనిని ఒక బాధ్యత గా స్వీకరించి పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు.తొలుత దేవస్థాన సహాయ కమీషనర్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ కు స్వాగతం పలికిన అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి, ప్రాంగణంలో కదంబం, మారేడు, నేరేడు మొక్కల్ని నాటారు.
కార్యక్రమంలో తాహశీల్థారు శ్రీనివాస్,సర్పంచ్ బోయిన విమలరామరాజు,ఎంపీడీఓ మాధవరావు, ఎన్ఆర్ఇజీఎస్ ఏపీఓ దయానందరాజు, మండల పార్టీ అధ్యక్షులు, బొర్రా శేషుబాబు, ఎంపీపీ అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ,ఎంపీటీసీ చొప్పర్ల సునీతా, మండల వ్యవసాయం సలహా చైర్మన్, కరేటి గోవిందరాజు, నిమ్మగడ్డ బిక్షాలు, షేక్ అల్లాభక్షు, శొంఠి నాగరాజు, గూడపాటి వరప్రసాద్, బేతపూడి వెంకటరమణ, మరీదు రాధాకృష్ణ, కాగిత రామారావు,, వల్లభనేని వెంకటరావు,, దాసరి శ్రీను,, ఆనందదాసు శివనాగేంద్ర,, నరసింహ,, మీగడ సూర్య,, శ్రవణం పూర్ణచంద్రరావు, పాల్లంకి రాజేష్, మొట్రు ఏసుబాబు, మరీదు వసంతరావు, తుమ్మచర్ల ఏసుబాబు, గణేశుల సురేష్, బొర్రా శ్రీహరిదాసు, సాక్షి సాయిబాబు, ఉల్లంకి నగేష్, చిన్నం అర్జునరావు,లేళ్ల ఆంజనేయులు, సోమ సత్యనారాయణ, రాచూరి కుమార్, పేరే రామకృష్ణ, ముత్యాల రాంబాబు, శీలం రామకృష్ణ,మాస్టారు సత్యనారాయణ,సుద్దాబత్తుల రమణ, పేర్ని పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *