కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యానికి గురియై ఆసుపత్రులలో వైద్య చికిత్స పొందిన నిరు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి అయ్యిన ఖర్చును అందింస్తూ వారిని ఆదుకోవడం జరుగుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం స్థానిక శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి వచ్చిన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డిఎన్ఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకున్న 8 మంది బాధితులకు ఇటీవల చెక్కులు రావడం జరిగిందన్నారు,. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ లో 2465 రకాల వైద్యసేవలు అందిస్తున్నారన్నారు.
నియోజకవర్గంలోని 8 మంది బాధితులు వివరాలు…
రేవు మహేష్(పెదలంక) కి రూ. 27.000/- , బంగారు సీతామహాలక్ష్మీ(లోకుమూడి)కి రూ. 14.000/- కలిదిండి వెంకటరావు(పెదగొన్నూరు)కి రూ.20.000/- అవనపు పద్మ(పేరూరు)కి.రూ.16.000/- వెలివెల కస్తూరి(వడాలి)కి రూ. 11.000/- వలవల సూర్య కుమారి(కోరుకొల్లు)కి రూ. 10.000/- గొడవర్తి వెంకటరత్నం(కోరుకొల్లు)కి రూ. 27.000/- తెంటు శ్రీదుర్గా(కైకలూరు) కి రూ. 25.000/- చెక్కులను అందజేశారు.
మొత్తం 8 మంది బాధితులకు మొత్తం రూ.1,50,000/- అందజేశారు.
కార్యక్రమంలో చెన్నంశెట్టి సోమేశ్వరరావు, తుమ్మచర్ల ఏసుబాబుతదితరులు పాల్గొన్నారు.
Tags kikaluru
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …