తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు చక్కబడాలని ప్రార్థించానన్నారు.
Tags tirumala
Check Also
డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి …