Breaking News

Tag Archives: tirumala

మహా కుంభ మేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో …

Read More »

తిరుమలలో నిండిన జలాశయాలు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి. 1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ. FRL :- 697.14 మీ. 2) గోగర్భం డ్యామ్ :- 2894 …

Read More »

టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ  బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జె.శ్యామలరావు బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రి నాదెండ్ల మనోహర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.

Read More »

అక్టోబరు 17న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ చేస్తారు విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Read More »

గరుడ వాహనంపై కలియుగ ప్రత్యక్షదైవం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు. వేంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. సాక్షాత్తు వేంకటనాథుడే తన అనుంగు వాహనంపై తమను దీవించేందుకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సేవలో మూల విరాట్‌ని అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల… తదితర వెలకట్టలేని ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించడం విశేషం. గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. సౌపర్ణుడు …

Read More »

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2024

-శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ కార్య నిర్వహణాధికారి శ్యామల రావు అదనపు ఈఓ …

Read More »

2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన

-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద …

Read More »

బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వం

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – అక్టోబరు 4న ధ్వ‌జారోహ‌ణంనాడు ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌ – వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం ఇలా… తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబ‌రు …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా.ఎల్. మురుగన్.

Read More »