Breaking News

Tag Archives: tirumala

సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జేఈవో

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలను శనివారం జిల్లాకలెక్టర్  వెంకటరమణా రెడ్డి, టీటీడీ జేఈవో సదాబార్గవి పరిశీలించారు. సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బారికేడ్లను వారు పరిశీలించారు. ఈ కేంద్రాలవద్ద పోగయ్యే చెత్త ఎప్పటికప్పుడు తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పారిశుధ్య కార్మికులను నియమిస్తామని జిల్లా కలెక్టర్  …

Read More »

ఆజాది కా అమృత్ మహోత్సవం…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.యస్.ఐ.) శిక్షణ సంస్థ మరియు దక్షిణ విభాగం ఆధ్వర్యంలో నేడు నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్ మరియు జియో హెరిటేజ్ సైట్ అయినటువంటి తిరుమల సహజ శిలాతోరణం(Natural Arc) యొక్క విశిష్టతని విద్యార్థులకు మరియు ప్రజలకి ఆజాది కా అమృత్ మహోత్సవం లో బాగంగా నేడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జియోలజిస్ట్ గంజి మల్లేష్ మాట్లాడుతూ 2001 లో జి.ఎస్.ఐ. ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా (1851 లో …

Read More »

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శ్రీనివాస్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : వి ఐ పి బ్రేక్ దర్శనం సమయంలో తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అనేక విపత్తుల వల్ల ఆర్థికంగా కుదేలైన అన్ని వర్గాల ప్రజలు శ్రీవారి కృపతో అభివృద్ధి సాధించాలని ప్రార్ధించినట్లు తెలిపారు

Read More »

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం సతీ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో ఎవి ధర్మారెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె మిశ్రా కూడా వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు.

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూకే మరియు యూరప్ దేశాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పది (10) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. యూకే మరియు యూరప్ దేశాలలో “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తితిదే అధ్యక్షులు వై.వి. సుబ్బారెడ్డి, APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తిరుమలలో ఈరోజు (23.09.22) ఆవిష్కరించారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి …

Read More »

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కరించిన ఈవో

తిరుమల, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం …

Read More »

కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అందుబాటులో 1189 మంది క్షురకులు – వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు తిరుమల, నేటి పత్రిక ప్రజా వార్త : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు స‌త్వ‌ర సేవ‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. ఎక్క‌డా ఆల‌స్యం లేకుండా మొత్తం 1189 మంది క్షుర‌కులు మూడు షిఫ్టుల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేలా ఏర్పాట్లు చేప‌ట్టారు. వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల త‌రువాత ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు …

Read More »

తిరుమలలో ఆగస్టు 19న గోకులాష్టమి ఆస్థానం, 20న ఉట్లోత్సవం

తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త: తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 19వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు …

Read More »

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలి

– భక్తుల కోసం తిరుమల ,అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు – అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు – రద్దీకి తగ్గట్టు పగడ్బందీ ఏర్పాట్లు -టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తుండటం ,పెరటాశి మాసం రావడంతో …

Read More »

వెంకన్న సన్నిధిలో గవర్నర్ దంపతులు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్, సప్రవ హరి చందన్ దంపతులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్​ బిశ్వభూషణ్​ దంపతులకు టీటీడీ అభికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో …

Read More »