తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.యస్.ఐ.) శిక్షణ సంస్థ మరియు దక్షిణ విభాగం ఆధ్వర్యంలో నేడు నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్ మరియు జియో హెరిటేజ్ సైట్ అయినటువంటి తిరుమల సహజ శిలాతోరణం(Natural Arc) యొక్క విశిష్టతని విద్యార్థులకు మరియు ప్రజలకి ఆజాది కా అమృత్ మహోత్సవం లో బాగంగా నేడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జియోలజిస్ట్ గంజి మల్లేష్ మాట్లాడుతూ 2001 లో జి.ఎస్.ఐ. ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా (1851 లో ఏర్పాటైoది) దేశంలోని 26 సైట్స్ ని నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్ మరియు జియో హెరిటేజ్ సైట్స్ గా కేంద్ర ప్రభుత్వం వారు నోటిఫై చేసారని అందులో మన తిరుమలలోని శిలాతోరణం ఒకటని అన్నారు. తెలుగు భాష: శిల అంటే ‘రాయి’ మరియు తోరణం అంటే రెండు నిలువు వరుసలు లేదా ‘వంపు’ని కలుపుతూ ఒక గుమ్మం మీద వేసిన దండలా వంపు 8 మీ (26.2 అడుగులు) వెడల్పు మరియు 3 మీ (9.8 అడుగులు) గా వుంది.
ఈ కార్యక్రమంలో సీనియర్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త & అధ్యాపకులు డా. మల్లేష్ గంజి డా. జి.జే.ఎస్ ప్రసాద్, నిర్దేశకులు, కుమారి. అనామిక, డా. అజయ్ డే, శ్రీ. అనూప్ దత్త, శ్రీ. వరప్రసాద్, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు , ఎస్ వి యునివర్సిటీ జియాలజీ హెచ్ ఓ డి మధు, జియాలజీ విద్యార్థులు, ఎస్.వి హైస్కూల్ తిరుమల విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News