విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ మరియు కంటి పరీక్షలు నిర్వహించారని 43 డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం భవానిపురం హె చ్ఐ జి 410 హెచ్ బి కాలనీ లో అసోసియేషన్ అధ్యక్షులు పీ వి కే ప్రసాద్, కోశాధికారి సతీష్ లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ క్యాంపులో సుమారు 200 మందికి కళ్ళ పరీక్షతోపాటు అవసరమైన వారికి ఉచిత కళ్ళజోళ్ళు కంటి డ్రాప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శివశంకర్ గోపి కరుణాకర్ కోటేశ్వరరావు డివిజన్ పెద్దలు రావు టీ ప్రకాష్ రావు బాలాజీ ఏపీ ఎస్ఏసిఎస్ కేడిఎల్ఓఏ ప్రాజెక్ట్ మేనేజర్ వి.వి సాంబశివరావు లు పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News